ఈ చిత్రం ప్రివ్యూ షోను తిలకించిన షకీలా... నేటి యువతకు ఓ సలహా ఇచ్చారు. "నేను బతికి ఉండగానే నా బయోపిక్ రూపొందడం ఎంతో ఆనందంగా ఉంది. రిచా చద్దా అద్భుతంగా నటించింది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎన్నో బాధలుంటాయి. నేను గౌరవాన్నో, సానుభూతినో కోరుకోవడం లేదు. అయితే నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కలేదని నేను భావిస్తాను.
నా వెనుక నా గురించి మాట్లాడే వారి గురించి నేను బాధపడను. నా ముఖం మీద విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్, చదువుకుంటున్న అమ్మాయిలకు ఈ సినిమా ద్వారా నేను చెప్పేదొక్కటే నేను మోసపోయినట్లు మోసపోకండని. సినిమా చూశాను. కాస్త డ్రామా యాడ్ చేసిన మేకర్స్ మూవీ లిబర్టీ తీసుకుని సినిమాను తెరకెక్కించారు. మహిళలకు ఈ సినిమాలో సందేశం ఉంది" అన్నారు.
తెలుగులో మాత్రం శృంగార తార సిల్క్ స్మిత తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సెక్స నటీమణుల్లో షకీలా ఒకరు. ఈమె సాధారణ స్టార్ నుంచి సూపర్ స్టార్‌గా ఎలా ఎదిగారన్నదనే ఈ చిత్రంలో చూపించారు. పైగా, షకీలా జీవించివుండగానే ఆమె జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం గమనార్హం.