యంగ్ హీరోయిన్‌తో కుమారి 21 ఎఫ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సుక్కూ..! (video)

శనివారం, 6 జులై 2019 (14:55 IST)
2015లో రాజ్ తరుణ్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ కుమారి 21 ఎఫ్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. 
 
తాజాగా డైరెక్టర్ సుకుమార్ విజయ్‌ దేవరకొండ తమ్ముడు హీరోగా నటించిన దొర‌సాని ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, అక్క‌డ ఆయ‌న మాట్లాడిన మాట‌లని బ‌ట్టి చూస్తుంటే ఈ డైరెక్ట‌ర్ త్వర‌లో హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌తో కుమార్ 21 ఎఫ్ సీక్వెల్ చేయ‌నున్న‌ట్టు అర్థమవుతుంది. 
 
దీనిపై త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. రంగ‌స్థ‌లం చిత్రం త‌ర్వాత సుకుమార్ ఎలాంటి ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఆయ‌న త‌దుపరి ప్రాజెక్ట్‌ని ఎప్పుడు ఏ హీరోతో చేస్తాడా అని సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు