తమిళ పిల్ల శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ - సారిక ముద్దుల కుమార్తెల్లో ఒకరు. ఈమె ఏ పనిచేసినా అందులో దాపరికం ఇసుమాత్రం కూడా ఉండదు. పైగా, అంతా ఓపెన్ టైప్. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా బాహాటంగానే తెలియజేస్తుంటారు.
తాజాగా తన లవర్ మైఖేల్ కోర్సల్‌తో బ్రేకప్ అయిన తక్కువ సమయంలోనే మరో వ్యక్తికి కనెక్ట్ అయింది. డూడుల్ ఆర్టిస్ట్‌గా పేరున్న శాంతను హజారికాతో శ్రుతీ సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. పైగా, తన కొత్త ప్రియుడిని కూడా తన తల్లిదండ్రులకు పరిచయం కూడా చేసింది.
ఇద్దరూ కలిసి ఎంత సేపు గడుపుతారనే మరో నెటిజన్ ప్రశ్నకు రోజంతా గడుపుతామని సమాధానమిచ్చింది. ప్రస్తుతం 24 గంటలు శాంతనుతోనే గడుపుతున్నాను. ఈ సమయంలో నేనే వంట చేస్తున్నా. శాంతను ఆలూ కర్రీ మాత్రం చేస్తాడు. తను పాలు, పంచదార లేకుండా అస్సాం టీ తాగుతాడు. నాకు మాత్రం టీలో అన్నీ ఎక్కువ ఉండాలి అని శ్రుతీహాసన్ చెప్పుకొచ్చింది.