ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి శృతి హాసన్ స్పందిస్తూ, వాస్తవానికి 'గబ్బర్ సింగ్' చిత్రంలో తాను నటించనని చెప్పానని, అయితే, ఆ పాత్రలో తనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేదని దర్శకుడు హరీశ్ శంకర్ తనను ఒప్పించారని ఆమె తెలిపారు. తనకు తొలి విజయం దక్కిందని టాలీవుడ్‌లోనే స్పష్టం చేశారు.
ఇక, పవన్ గురించి మాట్లాడుతూ, సెట్స్‌పై ఆయన ఎక్కువగా రైతుల గురించి, గ్రామాల గురించి మాట్లాడుతుండేవారని ఆమె తెలిపారు. పవన్‌కు రాజకీయ రంగం సరిగ్గా సరిపోతుందని శృతి అభిప్రాయపడ్డారు. కాగా, శృతిహాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.