అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించకపోయినా వారు షేర్ చేసే ఫోటోలు చూసి జనాలు అలా ఫిక్స్ అయిపోయారు. శాంతను తలపై నిమురుతూ, బుగ్గలు గిల్లుతూ, వెక్కిరిస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఫొటోలు దిగింది. ఇవి అభిమానులకు తెగ నచ్చేశాయి. కాగా, ఇటీవలే శాంతను హిందీ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తూ, వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, చాలా అభిప్రాయాలు కలిశాయని చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగత విషయాలు చర్చించాలనుకోవట్లేదు అంటూ ప్రేమ ప్రశ్నలపై సమాధానాన్ని దాటవేశారు.
అయితే ఈ జంట ఫొటోలు బాగా పాపులర్ అవుతున్నాయి. ఇటీవలే తన రెమ్యునరేషన్‌తో ఓ ఇంటిని కూడా కొనుక్కున్నాననీ, కిస్తీలు కడుతున్నానని నిన్ననే స్టేట్ మెంట్ ఇచ్చింది. మరి ఆ ఇల్లు వీరికోసమేనా! అనే అనుమానాలుకూడా కలుగుతున్నాయి.