మా ప్రాథమిక సభ్యత్వానికి శివాజీ రాజా రాజీనామా!

సోమవారం, 11 అక్టోబరు 2021 (20:15 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలు మరో వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓటమి చెందగా, మంచు విష్ణు గెలుపొందారు. అయితే, మా అధ్యక్షుడుగా మంచు విష్ణు ఎన్నికైన తర్వాత 'మా'కి రాజీనామాల పర్వం మొదలైంది. 
 
ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా మెగాబ్రదర్ నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోమవారం ఉదయం ప్రకాష్ రాజ్ రాజీనామా చేశారు. తాజాగా శివాజీ రాజా కూడా 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల ముందు మా ఎన్నికలపైన మాట్లాడిన ఆయన నటుడు నరేష్‌పైన సంచలన ఆరోపణలు చేశారు. నరేష్ కారణంగానే 'మా' ఎన్నికల్లో ఇంత రచ్చ జరుగుతోందని.. అతని వల్లే ఇన్ని విభేదాలంటూ కామెంట్స్ చేశారు. అలాగే, గతంలో జరిగిన తప్పులపై విచారణ జరిపి తప్పని తేలితే నరేష్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు