'డబ్ల్యూ' మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ మిస్ వరల్డ్ బ్యూటీ, నేడు ఎందరో అమ్మాయిలు, యువతులు తాను ప్రచారం చేస్తున్న వివిధ బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేసింది. తన చిన్నప్పుడు మూడేళ్ల పాటు అమెరికాలో చదువుకున్న సమయంలో స్కూల్లో జాతి వివక్షకు కూడా గురయ్యానని వెల్లడించింది.