సమాజంలో జరిగే అవినీతి అక్రమాలపై పోరాడే వ్యక్తిగా డాక్టర్ మోహన్‌బాబు నటించారు. ఇప్పటికీ టీజర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. కరోనా వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. తాజాగా సినిమాను విడుదతేదీని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు ఈ రోజు (2.2.2022) మోహన్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
అదనంగా చిత్రానికి స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా మోహన్ బాబు నిర్వహించారు. ప్రముఖతారాగణమంతా ప్రధానపాత్రలను పోషించిన 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం డాక్టర్ మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఊహించని మలుపులతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.