కరోనా సమయంలో నటుడు సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెల్సిందే. గతేడాది కరోనా సమయంలో సోను సూద్ చేసిన సేవలను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తిరిగి సినిమాలతో బిజీగా మారిన సోనూ సూద్ సెట్‌లో దోసె పాఠాలు చెబుతున్నాడు.
sonu sood
సినిమా షూటింగ్‌లో ఉన్న సోను సూద్ దోశ వేస్తూ రెండు నిమిషాల వీడియోను రూపొందించి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు. అందులో భాగంగా నటులు కావాలనుకున్న వారు దోసెలు కూడా వేయడం నేర్చుకుంటే చాలా మంచిదని సెలవిచ్చాడు.
అంతేకాకుండా చాలా గుండ్రంగా క్షణాల్లో అద్భుతమైన దోసెను వేసి చూపించాడు. ఈ దోశతో కొబ్బరి చట్నీ, కారప్పొడి ఉంటే అద్భుతంగా ఉంటుందని కూడా తెలిపాడు. కష్టపడి సంపాదించుకో, సంతోషంగా తిను అని సోనూసూద్ పిలుపునిచ్చాడు.