శ్రీ రెడ్డి అంటే ఇప్పుడు తెలియనివారు లేరనడంలో అతిశయోక్తి లేదు. సామాజిక మీడియాను వేదికగా చేసుకుని క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై పోరాటం చేస్తున్నానంటూ సిగ్గు, బిడియం లేకుండా అడల్ట్ పోస్ట్‌లు, కామెంట్స్‌తో చెలరేగిపోయింది.
ఇన్ని రోజులుగా తోటి నటులు, సినీ పెద్దలపై లైంగిక ఆరోపణలు చేస్తూ పోస్ట్‌లు చేసిన శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా విరామం ఇచ్చి ఈసారి తన ఫోటోనే పోస్ట్ చేసింది. ఇందులో విశేషమేంటంటే ఎలాంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా, డాబాపై అలా రిలాక్స్ అవుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటోకు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది.
గత కొంతకాలంగా శ్రీరెడ్డి చెన్నైలో ఉంటోంది. అయితే ఆమె ఉండే ఏరియాలో కరెంట్ లేకపోవడంతో ఉక్కపోత భరించలేక డాబా ఎక్కిందట శ్రీ రెడ్డి. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ''చెన్నైలో నేను ఉంటున్న ఏరియాలో కరెంట్ పోయింది... 8 గంటలు గడిచినా కరెంట్ రాలేదు. ఇంట్లో బాగా నీరసించిపోయా.. ఇక డాబా పైకి వచ్చి ఓ చిన్న కునుకు తీసి సేద తీరాను'' అని ట్యాగ్ చేసింది.