బాబు ఫోటో పీకేసినా ఫర్వాలేదు... కానీ ఎన్టీఆర్ ఫోటోనే పీకి పారేస్తారా?(Video)

శనివారం, 22 జూన్ 2019 (17:42 IST)
బెజవాడ కార్పోరేషన్లో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోల రగడ రచ్చ రచ్చయింది. తనని అడగకుండా ముఖ్యమంత్రి జగన్ ఫోటోను హాల్లో ఎందుకు పెట్టారంటూ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫోటోను, చంద్రబాబు ఫోటోను తొలగించి జగన్ ఫోటో పెట్టిన కార్పోరేషన్ అధికారులపై మండిపడ్డారు.
 
చంద్రబాబు ఫోటో తీసినా ఫర్లేదు.. కానీ ఎన్టీఆర్ ఫోటో ఎందుకు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫోటోతో పాటు రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టాలని వైసీపీ కార్పోరేటర్ల డిమాండ్ చేశారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన మేయర్, రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టడానికి వీల్లేదన్నారు. చనిపోయిన సీయంల ఫోటోలు కౌన్సిల్ హాల్లో పెట్టడం సాంప్రదాయమంటూ వైసీపీ సభ్యులు చెప్పారు. 
 
ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు దివంగత సీయంలే కాబట్టి పెడితే ఇద్దరివి పెట్టాలని మేయర్ పోడియం వద్ద ఆందోళన చేసారు వైసీపీ కార్పోరేటర్లు. దీంతో ఆగ్రహం చెందిన మేయర్, కార్పోరేషన్ నాది.. నేను చెప్పిందే చేయాలంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. చూడండి వీడియోలో..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు