ఢీ షో తరువాతే సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడ డ్యాన్సులు, మ్యాజిక్, కామెడీ చేయడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ట్రై చేద్దామని కొంత మంది వచ్చారు. ఎదుటివాళ్ళు నన్ను నమ్మినప్పుడు.. నాపై నాకు కూడా నమ్మకం ఉండాలి కదా? అని సినిమాలను అంగీకరించాను. అలా అని సినిమాలే కాదు.. బుల్లితెరపై కూడా షోలు చేస్తుంటాను. అని సుడిగాలి సుధీర్ అన్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్‌యాక్షన్ ఎంటర్‌టైనర్ `గాలోడు` ఈ చిత్రం నవంబర్ 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ పలు విషయాలుముచ్చటించారు.