అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

ఐవీఆర్

శుక్రవారం, 17 అక్టోబరు 2025 (15:28 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ నగరంలోని మధురానగర్‌లోని ఓ యజమాని కామాంధుడయ్యాడు. తను అద్దెకి ఇచ్చే ఇంట్లోని బాత్రూమ్ లోపల సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసాడు. జవహర్‌నగర్‌లోని అశోక్‌ అనే ఇంటి యజమాని ఇంట్లో అద్దెకు వుంటున్నారు దంపతులు. ఐతే స్నానాల గదిలోని బల్బ్ హోల్డర్ చూసేందుకు కాస్త తేడాగా కనిపించడంతో మహిళ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. దీనితో ఈ విషయాన్ని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
 
ఫిర్యాదు అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా అక్టోబరు 13న సీక్రెట్ కెమెరాను అమర్చినట్లు గుర్తించారు. ఇంటి యజమాని అశోక్ ఎలక్ట్రీషియన్‌ చింటూతో కలిసి బాత్‌రూమ్‌లో బల్బు హోల్డర్‌లో సీసీ కెమెరా అమర్చినట్లు తేలింది. అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్‌ చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు