పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్గా ఎదిగి.. బిటౌన్లో ఆఫర్లు సొంతం చేసుకుంటున్న అందాల తార సన్నీ లియోన్.. డేనియల్ను పెళ్ళాడి సెటిలైపోయింది. అశ్లీల చిత్రాల్లో నటించినప్పటికీ.. వివాహానికి అనంతరం బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లు చేతినిండా ఉన్నాయని సన్నీ లియోన్ వెల్లడించింది. పోర్న్ సినిమాల కోసం అప్పట్లో చాలామందితో శారీరక సంబంధాలు పెట్టుకున్నానని.. పెళ్ళికి తర్వాత తన భర్తతో మాత్రమే శారీరకంగా సన్నిహితంగా ఉన్నట్లు సన్నీ చెప్పింది.
ఇంకా ఫ్యాషన్‌ను బట్టే జనం తీర్పులిస్తూ వుంటారని సన్నీ చెప్పింది. ఎదుటివాళ్ళు ఏం వేసుకున్నారోనని మనం కూడా ఆసక్తిగా చూస్తాం కదా అని చెప్పింది. ఫ్యాషన్‌గా ఉండాలంటే ఖరీదైన బట్టలే వేసుకోనక్కర్లేదని చెప్పింది. సాధారణ వస్త్రాలతో కూడా ఫ్యాషన్ గా కనిపించవచ్చని అభిప్రాయపడింది. ఫ్యాషన్‌లో జనానికి ఆసక్తి కలిగించే అంశం ఏమిటో తెలుసుకోవడానికి తాను ఎప్పుడూ ప్రయత్నిస్తానని చెప్పింది.