క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినీ నటి సురేఖా వాణి.. ఆలీతో సరదాగా షోలో పాల్గొంది. తను బుల్లితెర లోకి వచ్చి 22 సంవత్సరాలు అయిందని తెలిపింది. తాను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సిటీ కేబుల్‌లో యాంకర్‌గా చేసిందట. తన తండ్రి స్నేహితులకు సిటీ కేబుల్ ఉండేదని అందులో తన బాబాయ్ కూడా పని చేసే వాడని తెలిపింది.
అంతేకాకుండా తను తన భర్తను సిటీ కేబుల్‌లోనే కలిసిందట. అక్కడి నుండి వాళ్ళ ప్రేమ పెళ్లి గా మారిందని తెలిపింది. ఇక ఇటీవల ఆమె విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో నటించగా తనను ఎడిటింగ్ లో తొలగించారని తెలిపింది. కానీ ఓటీటీ లో యాడ్ చేశారని.. తాను నటించిన సన్నివేశాలు బాగున్నాయని.. సినిమా చూసిన వాళ్ళు చెప్పారని తెలిపింది.