ఓ మహిళపై మూడేళ్ళపాటు అత్యాచారం చేసిన కేసులో ప్రముఖ ఆడియో సంస్థ టి సిరీస్ మ్యూజిక్ కంపెనీ అధినేత, నిర్మాత భూషణ్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై పోలీసులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు.
కాగా, 1997లో తన తండ్రి గుల్షన్ కుమార్ హత్యానంతరం భూషణ్ కుమార్ టీ సిరీస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు. 2001లో తుమ్ బిన్‌తో చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టి పలు విజయవంతైన చిత్రాలు నిర్మించాడు. భూషణ్ కుమార్ 2005 పిబ్రవరి 13న నటి దివ్యా ఖోస్లాను వివాహం చేసుకున్నారు. వీరికిరూహన్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు.