ఇటీవలే టీజర్ విడుదల చేశారు. ఇందులో ఆమె కరడుగట్టిన మనుషులు వుండే అటవీ ప్రాంతంలో అటవీ అధికారిణిగా నటించారు. ట్రైలర్‌లో ఓ డైలాగ్ వుంటుంది. పెద్ద పెద్ద మగాళ్ళే సాల్వ్ చేయని సమస్య ఆడది ఆఫీసర్‌గా ఏం చేస్తుంది? అనేది. ఈడైలాగ్ ఆమె చెవిన పడుతుంది. ఆ తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు కథేమిటి? అనేది పూర్తిస్థాయి అటవీ నేపథ్యంలో సాగే కథ ఇది. విద్యాబాలన్‌తో పాటు, శరత్ సక్సేనా, ముకుల్ చడ్డా, విజయ్ రాజ్, ఇలా అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబీ నటిస్తున్నారు.
ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ, నేను ఈ కథ వినకముందు ఆ ప్రపంచాన్ని గొప్పగా ఊహించుకున్నా. కానీ కథ విన్నాక నేను చాలా ఆశ్చర్యపోయా. ఇలాంటి రక్తంతాగే మనుషులు కూడా వుంటారా? అనిపించింది. అందుకే నటికి పలానా పాత్ర చేయాలనే కొలమానాలే పెట్టుకోకూడదని నేను వెంటనే ఈ పాత్రను చేయడానికి సిద్ధమయ్యా. మనిషికి మనిషికి మధ్య గౌరవమేకాదు. జంతువు మధ్య కూడా వుండాలి. ఇలాంటి సున్నితమైన అంశం నన్ను బాగా ఆకట్టుకుంది అని తెలిపారు.
టి-సిరీస్, అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్ నిర్మించిన షెర్ని 2021 జూన్ 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.