గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెట్టిన మిలింద్‌పై కేసు

శనివారం, 7 నవంబరు 2020 (13:47 IST)
Milind Soman
బాలీవుడ్ నటుడు, ఫిట్‌నెస్‌ శిక్షకుడు మిలింద్‌ సోమన్‌ వివాదంలో చిక్కుకున్నాడు. గోవా బీచ్‌లో నగ్నంగా పరుగెట్టిన కారణంగా మిలింద్‌ సోమన్‌పై కేసు నమోదైంది. నవంబర్‌ 4న తన పుట్టినరోజు సందర్భంగా దక్షిణ గోవాలోని బీచ్‌లో నగ్నంగా పరుగెట్టిన ఓ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. 'నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. 55 ఏళ్లు వచ్చినా పరుగెడుతున్నా..' అంటూ పేర్కొన్నాడు. 
 
కాగా ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాగా ఆ ఫొటోపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలతను పెంపొందించే విధంగా ఈ చర్య వుందని పేర్కొన్నారు. దీనిపై దక్షిణ గోవా సూపరింటెండెంట్ పంకజ్‌ కుమార్‌ స్పందించారు. మిలింద్‌ సోమన్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉంచిన ఫొటోను నిర్ధారించుకొని అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 
కాగా.. గోవా బీచ్‌లో ఉదయం మిలింద్‌ సోమన్‌ నగ్నంగా పరిగెత్తగా ఆ ఫొటోను ఆయన సతీమణి అంకితా కోన్‌వార్‌ తీసింది. అనంతరం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు సినీనటి పూనం పాడే స్విమ్ సూట్ ధరించి అశ్లీల వీడియోను చిత్రీకరించిందని పోలీసులు ఆమెను అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. 
 
దీంతో మిలింద్ సోమన్ తన నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నెటిజన్లు ప్రశ్నించడంతో పోలీసులు ఎట్టకేలకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 294, సెక్షన్ 67 ప్రకారం బీచ్ లో తన నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు