ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు కోసం భారీగా ఖర్చు అయ్యిందని.. ఆ ఖర్చుతో పది సినిమాలు తీయొచ్చునని ప్రముఖ దర్శకనిర్మాత చేసిన వ్యాఖ్యలపై.. మెగాబ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఆర్ఆర్ యూనిట్ అంత ఖర్చు చేసినట్టు నీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయా? అని రాఘవేంద్రరావు ప్రశ్నిస్తే.. 'నీ అమ్మ మొగుడు పెట్టాడారా రూ.80 కోట్ల ఖర్చు' అంటూ నాగబాబు ఘాటుగా స్పందించారు.
ఇందుకు తమ్మారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "నేను నోరు విప్పితే, అందరి బాగోతాలు బయటపడతాయి" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను తప్పు చేయలేదని.. అలాంటప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదన్నారు తమ్మారెడ్డి. చిన్న సినిమాలపై మూడు గంటలు మాట్లాడితే... అందులో నుంచి ఒక క్లిప్పింగ్ ఆధారంగా తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. జక్కన్న రాజమౌళిపై ఈర్ష్యతో అలా మాట్లాడానని అంటున్నారు.