Sushmita Konidela, Director Prashant
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా పలు ప్రాజెక్ట్‌లు చేస్తుంది. ఆమధ్య వెబ్ సిరీస్ చేసింది కూడా. తాజాగా శ్రీదేవి శోభన్‌బాబు అనే సినిమాను తన భర్త విష్ణుప్రసాద్‌తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకుడు. ఆయన సుష్మితగారిని అనుకోకుండా జూబ్లీహిల్స్‌లోని కాఫీషాప్‌లో కలిశాడట. ఆ వివరాలు చెబుతూ, నేను ఓ రోజు కాఫీషాప్‌కు వెళ్ళాను. అక్కడ సుష్మితగారు తన ఇద్దరు కుమార్తెలతో ఓ టేబుల్ దగ్గర వున్నారు. నేను, సంతోష్ కలిసి కాఫీ షాప్‌కు వచ్చాం. సుష్మితగారిని చూడగానే ఒక్కసారిగా చిరంజీవిగారు గుర్తుకువచ్చారు.