ఇంద్ర సినిమాలో బాలనటుడిగా పరిచయమై ఆ తర్వాత హీరోగా ఎదిగి జాంబి రెడ్డి వంటి సినిమా చేసినా ఇంకా తనను చిన్నపిల్లాడిగా చూస్తున్నారంటూ తేజ్ సజ్జ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మతో జాంబి రెడ్డి చేసిన ఆయన తాజాగా హనుమాన్ అనే పాన్ వరల్డ్ సినిమా కూడా చేశాడు. హైదరాబాద్ లో ఈ రోజే ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ హీరో స్థాయిని మించి వుందనిపించింది. దీనిపై సీనియర్ ఒకరు వేసిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం.