కానీ, నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంధికి సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో అబాసుపాలయింది. ఇందుకు ఇతర భాషా నటీనటులు ఘాటుగా స్పందించారు. అది మెగా ఫ్యామిలీకి చుట్టుకుంది. దాంతో అల్లు అరవింద్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సురేష్ కొండేటి మా కుటుంబానికి పి.ఆర్.ఓ. కాదు. గోవా అవార్డులు ఫెయిల్ అయింది. ఇతర భాష నటీనటులు, సాంకేతిక సిబ్బంది మన తెలుగు సినిమా రంగాన్ని తిట్టుకుంటున్నారు. అందుకే ఆయనకు మాకు సంబంధం లేదని చెప్పారు.
దీనిపై సురేష్ కొండేటి వివరణ ఇలా వుంది..
గత 21 సంవత్సరాలుగా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి సంవత్సరం చాలా కష్టపడి, గ్రాండ్‌గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్, అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరుపేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంతమంది బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి.