అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఈనెల 5న సినిమా థియేటర్లలో విడుదలకాబోతుంది. ఇప్పటికే దేశంలో పలుచోట్ల పుష్ప 2 టీజర్, ట్రైలర్ ఈవెంట్ లు నిర్వహించారు. పాట్నా, చెన్నై, కేరళ, ముంబై వంటి చోట్ల నిర్వహించిన ఈవెంట్లకు భారీ స్పందన వచ్చింది. ఎక్కడ ఈవెంట్ జరిగినా చిత్ర దర్శకుడు సుకుమార్ మాత్రం హాజరు కాలేదు. తను పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడని అల్లు అర్జున్ వెల్లడించారు.