"నా కలలు అన్నింటిని నాకు నేనుగా సొంతంగా సాధించుకున్నాను. నేను ప్రేమిస్తున్నా ఏకైక వ్యక్తిని నేనే. అందుకే నన్ను నేను వివాహం చేసుకున్నాను" అని రాసుకొచ్చింది కనిష్క సోని. ఈ వీడియో పై కొందరు ఆమెకు మద్దతుగా స్పందించగా కొందరు ఆమెను ద్వేషిస్తూ కామెంట్స్ చేశారు. అయితే ఆమెను ద్వేషిస్తూ తనపై నెగటివ్ గా కామెంట్స్ చేసినవాటిపై స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.
నన్ను నేను నిజాయితీగా చెప్పేది ఒకటే. కానీ మాటలకు విలువ ఇచ్చి కట్టుబడు ఉండే వ్యక్తి నా జీవితంలో నాకు కనపడలేదు. అబ్బాయిలు తమ మాటలకు కట్టుబడు ఉండరని నాకు అర్థం అయ్యింది. శృంగారం కోసం పురుషుడి అవసరం లేదని నేను కచ్చితంగా చెప్పగలను. వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు. అది ప్రేమ, నిజాయితీకి సంబంధించినది అని చెప్పుకొచ్చింది నటి కనిష్క సోని.