ఒకే సినిమాలో పది కథలు వాలెంటైన్స్ నైట్ గురించి చిత్ర టీమ్

మంగళవారం, 24 జనవరి 2023 (15:13 IST)
Valentine's night team
సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో స్వాన్ మూవీస్ సమర్పణలో ఫన్ సాగ బ్యానర్ పై అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ''వాలెంటైన్స్ నైట్'. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ (MO) నారల నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది.  జనవరి 26న ఈ చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్  పలు విషయాలు తెలియజేసింది.
 
చైతన్య రావు మాట్లాడుతూ,  ఒకే సినిమాలో దాదాపు పది కథలు చూడొచ్చు. ఒక కథకి మరో కథకి ఎక్స్ లెంట్ ఇంటర్ లింక్ వుంటుంది. ఫ్యామిలీ తో కలసి చూడాల్సిన సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత మంచి ఫీల్ లో బయటికి వెళ్తారు. ఇంతమంచి పాత్ర నాకు నచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. జైపాల్ డీవోపీ ఈ చిత్రానికి ఒక మెయిన్ అసెట్. విజువల్స్ వండర్ ఫుల్ గా వుంటాయి. దర్శకుడే ఈ సినిమాకి సంగీతం అందించడం మరో ప్లస్ పాయింట్. అనిల్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బ్రేకప్ సాంగ్ చాలా వైరల్ అయ్యింది. సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ కి వచ్చిన జానీ మాస్టర్, గెటప్ శ్రీనుకి కృతజ్ఞతలు. వాలెంటైన్స్ నైట్ పీవీఆర్ విడుదల చేయడం ఆనందంగా వుంది. జనవరి 26న అందరూ సినిమా చూడండి. తప్పకుండా సినిమా మిమ్మల్ని అలరిస్తుంది’’ అన్నారు.
 
దర్శకుడు అనిల్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. జవనరి 26న ''వాలెంటైన్స్ నైట్'' విడుదల కాబోతుంది. ఆరుగురు జంటల కథ ఇది. ఒకరి కథలోకి ఒకరు ప్రవేశించిన తర్వాత  ''వాలెంటైన్స్ నైట్'' నాడు ఏం జరిగిందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించాం. ఇందులో ప్రేమ, రోమాన్స్, టీనేజ్ లైఫ్.. అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. తాజాగా విడుదలైన పాట కూడా వైరల్ అయ్యింది. విజువల్ గా ఇది పెద్ద సినిమాలా వుంటుంది.  అందరూ సినిమాని ఆదరించాలి’’ అని కోరారు.
 
లావణ్య మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్ గారు కష్టపడి తీశారు. నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. అన్ని ఎమోషన్స్ వున్న సినిమా ఇది.  ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. జనవరి 26న అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి' అని కోరారు.
 
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. జయాపజయాలు గురించి ఆలోచించకుండా బుల్లితెర నటలని ‘త్రీమంకీస్’ చిత్రం ద్వారా వెండితెరపై చూపించిన దర్శకుడు అనిల్ కు అభినందనలు. ఇలాంటి ప్రయత్నాలు జరిగితేనే కొత్త ప్రతిభ బయటికివస్తుంది. ''వాలెంటైన్స్ నైట్'' కూడా గొప్ప విజయం సాధించాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్, జవనరి 26న  సినిమా విడుదలౌతుంది. అందరూ ప్రోత్సహించాలి’’ అని కోరారు.
 
గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ట్రైలర్ సాంగ్స్ ప్రామెసింగా వున్నాయి. క్యురియసిటీని పెంచే కథతో సినిమాని తెరకెక్కించారు. మంచి నటుడైన చైతన్య  హీరో అవ్వడం చాలా ఆనందంగా వుంది. లావణ్య చాలా సహజంగా కనిపించింది. పెద్ద సినిమాలు చేస్తూనే కంటెంట్ వున్న చిన్న మీడియం సినిమాలో పాత్రలు చేస్తున్న సునీల్ గారికి కృతజ్ఞతలు. జవనరి 26న ''వాలెంటైన్స్ నైట్'' రాబోతుంది. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు