థాంక్యూకు విలువ లేకుండా చేశాం - నాగచైతన్య మూడు కోణాల్లో కనిపిస్తారు- డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్
శుక్రవారం, 15 జులై 2022 (07:35 IST)
Vikram K. Kumar
అక్కికేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం థాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కె.కుమార్ .. థాంక్యూ సినిమా గురించి పాత్రికేయులతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
* థాంక్యూ అనే పదాన్ని మనం నిత్య జీవితంలో పలు సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. కానీ అసలైన ప్రాముఖ్యతను గుర్తించి థాంక్యూ చెప్పే సందర్భంలో మాత్రం చెప్పం. నిజానికి థాంక్యూ అనేది చాలా పవర్‌ఫుల్ పదం. దానికి మనం విలువ లేకుండాచేశాం.
* నేను ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నానంటే మా నాన్నగారే కారణం. ఆయనకు నేను ఏ రోజూ థాంక్స్ చెప్పలేదు. కానీ ఓరోజు ఆయన ఈ లోకాన్ని విడిచి పెట్టేసి వెళ్లిపోయారు. నిజానికి మన తల్లిదండ్రులు మన నుంచి థాంక్యూ అనే పదాన్ని చెప్పాలని కోరుకోరు. ఒకవేళ చెప్పిన వారికి కోపం వస్తుంది. కానీ మనం వారికి థాంక్యూ చెప్పాలి.
* మూడు నాలుగేళ్ల నుంచి నేను, చైతన్య కలిసి ఓ సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నాం. దానికి సంబంధించిన చర్చలు జరుగుతూనే వచ్చాయి. అలాంటి సమయంలో ఈ స్క్రిప్ట్ వచ్చింది. ఇందులో నాగ చైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. అందులో 16 ఏళ్ల పిల్లాడిలా కనిపించే పాత్ర ఒకటి. అలాగే 20-21 ఏళ్ల వయసుండే కుర్రాడిగా కనిపిస్తారు. తర్వాత 35-40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు.
* 16 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం కోసం చైతన్య చాలా కష్టపడ్డారు. 40-50 రోజుల పాటు స్పెషల్ డైట్ తీసుకుని బరువు తగ్గి తన లుక్‌ను మార్చుకున్నారు. ఆ పాత్రకు సంబంధించిన క్రెడిట్ అంతా నాగ చైతన్యకే దక్కుతుంది.
* ప్రేమమ్, ఆటోగ్రాఫ్ సినిమాలు గొప్ప సినిమాలు. అలాంటి సినిమాలతో మా థాంక్యూ సినిమాను పోల్చితే మాకు చాలా ప్లస్ అయినట్లే. ఇది ఒక వ్యక్తి జర్నీ. అలాంటి కోవకు చెందిన సినిమానే అయినా ఆ సినిమాలకు దీనికి టచ్ ఉండదు.
* థాంక్యూ సినిమాలో ఓ మ్యాజిక్ ఉంటుంది. కచ్చితంగా అది ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత మన జీవితంలో కచ్చితంగా కొందరికి థాంక్స్ చెప్పాలని నేను, చైతన్య భావించాం. ఆ ఫీలింగ్ మా ఇద్దరిలోనూ కలిగింది. అలా కొందరికీ థాంక్స్ చెప్పిన తర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేశాం.
* బివిెస్ రవి వచ్చి ఈ కథను చెప్పగానే కథలోని మెయిన్ సోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సోల్‌ను నా స్టైల్‌లో ఆడియెన్స్‌కు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా ముందుకు వెళ్లాం. దర్శకుడిగా నేను వేరే కథకు కనెక్ట్ కాలేనప్పుడు ఆ సినిమాను డైరెక్ట్ చేయలేను కదా.
* ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని స్క్రీన్‌పై చూపించాలంటే సంగీతానికి చాలా ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. తమన్ మా సినిమాకు అద్బుతమైన సంగీతాన్ని అందించారు. రీసెంట్‌గా బ్యాగ్రౌండ్ స్కోర్ విన్నాను. చాలా చాలా బాగా చేశాడు. మనసు పెట్టి మ్యూజిక్ అందించాడు తమన్.
* రాశీ ఖన్నా పాత్ర.. అభిరామ్ జర్నీలో చాలా కీలకమని చెప్పాలి. అభిరామ్ పాత్రను కథకు కనెక్ట్ అయ్యేలా చేసే పాత్ర ఆమెది. అందులో ఆమె నటించిన ఓ సీన్ ఉంటుంది. దాన్ని ఆమె ఎక్సలెంట్‌గా చేసింది. దాన్ని నేను మానిటర్‌లో చూసినప్పుడు నా కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. మాళవికా నాయర్ అద్భుతమైన నటి. ఆమె చేయాల్సినన్ని సినిమాలు చేయలేదనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తనకు నటిగా ఇంపార్టెన్స్ మరింతగా పెరుగుతుంది. అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె చిన్నప్పటి నుంచే నటిగా మెప్పిస్తోంది.
* మనలో చాలా మంది జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చామని అనుకుంటూ ఉంటారు. కానీ వారి సక్సెస్‌లో ఇతరుల సపోర్ట్ ఎంతో ఉంటుంది. దాన్ని ఎవరూ గుర్తించరు. గుర్తించిన అహంతో ఉండిపోతారు. కానీ మన సక్సెస్‌లో భాగమైన వారికి థాంక్స్ చెప్పటంలో ఓ సంతోషం ఉంటుంది. మన జీవితంలో మార్పుకు వ్యక్తులే కారణంగా ఉండాలనేం లేదు. కొన్ని సందర్భాలు కూడా మనలో మార్పుని తీసుకొస్తాయి. ఏదేమైనా మనలో ఆ కృతజ్ఞతాభావం అనేది ఉండాలి.
* నేను దిల్‌రాజుగారి బ్యానర్‌లో చేస్తోన్న తొలి చిత్రం థాంక్యూ . ఎప్పటి నుంచో ఆయనతో కలిసి సినిమా చేయాలని అనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్నాం కానీ కుదరలేదు. ఈ సినిమాతో పర్ఫెక్ట్ మూవీ.
* నేను, రాజుగారు, పి.సి గారు కలిసి ముందు ద్వి భాషా చిత్రంగా థాంక్యూ ను చేద్దామని అనుకున్నాం. కానీ చివరకు దీన్ని ముందు తెలుగులో చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇది యూనివర్సల్ పాయింంట్.
* నాగ చైతన్యతో కలిసి దూత అనే వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ కోసం చేస్తున్నాను. ఈరోజుతో నాగ చైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తవుతుంది. మరో 15 రోజుల్లో చిత్రీకరణంతా పూర్తవుతుంది.
* 24 సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనైతే ఉంది. ఓ నాలుగైదు పేజీల్లో ఏం చేయాలనే ఆలోచనను రాసుకున్నాను కూడా. కానీ పూర్తి స్థాయిలో రెడీ చేయలేదు. అందులో ఆత్రేయ పాత్రను ఎలా ఆవిష్కరించాలనే దానిపై ఆలోచిస్తున్నాను.
* ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. కథను సిద్ధం చేస్తున్నాను. అలాగే ఓ హిందీ సినిమా చేయడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే పూర్తి వివరాలను తెలియజేయలేను. హిందీలో చేయబోయేది యాక్షన్ మూవీ.