ఈ ఫోటో సిరీస్ లోని అంత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకూ భారతీయ సినీ చరిత్ర లో ఇంత వినూత్న తరహా లో ఫోటోలను తీయడం జరగలేదు. అందువల్ల ఇది సమ్ థింగ్ స్పెషల్ ఫోటో సీరిస్ అని ఫోటోగ్రాఫర్ నవీన్ కళ్యాణ్ చెబుతున్నారు. అందమైన ఆరాధ్యదేవిని ఒక వైల్డ్ యానిమల్ కంపేరిజన్ తో సరికొత్త క్రియేటివిటీ తో, ఆమెలోని అందాన్ని అడివి మృగాలతో మిక్స్ చేసిన హై ఫ్యాషన్ ఫోటో సీరిస్ గా రూపొందించారు. ఈ వైల్డ్ ఫోటో లలో ఆరాధ్య ని అడివి జంతువులైన మాకావు , ఇగువానా , కొండచిలువ, నల్ల హంస, ఆస్ట్రీచ్ మరియు రేస్ గుర్రoల తో కలిసి కళ్యాణ్ ఈ అధ్బుతమైన చిత్రాలను తన కెమెరాలో భందించారు. ఈ ఫోటో షూట్ కు ప్రణతి వర్మ కాస్టుమ్ డిజైనర్ గా వ్యవహరించారు. చూపు మరల్చనీయకుండా చేసే ఈ ఫోటో సీరిస్ స్వేచ్ఛకు, నిర్భయానికీ ప్రతీకగా ఉన్నాయి.