కోలీవుడ్ హీరోయిన్ త్రిష వివాదాలకు పెట్టింది పేరు. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక అమ్మడు మళ్లీ రానాతో స్నేహం చేస్తుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ తాజాగా ధనుష్‌తో త్రిష కాస్త క్లోజ్‌గానే మూవ్ అయ్యిందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అమలాపాల్ విడాకుల వ్యవహారానికి ధనుషే కారణమని వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష కూడా ధనుష్‌కి క్లోజ్ అయ్యిందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.
గతంలో రానా-త్రిషలు చెట్టాపట్టాలేసుకొని తిరగడం, ఫొటో షూట్‌లకు ప్రత్యేకంగా ఫోజులివ్వడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతానికి త్రిష ఒంటరిగానే ఉంటోందని అందరూ అనుకున్నారు. కానీ త్రిష మళ్ళీ ధనుష్‌కు దగ్గరైయిందని.. ఈ రిలేషన్ షిప్ కాస్తా హద్దులు దాటుతోందని కోలీవుడ్ మీడియా కోడైకుస్తుంది.
వరుణ్‌తో త్రిష యంగేజ్ మెంట్ బ్రేక్ అవ్వడానికి కూడా ధనుష్ ఫ్రెండ్ షిప్పే కారణమని అప్పట్లో చెప్పుకున్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత కాస్త గ్యాప్ మేంటైన్ చేసి త్రిష ఇప్పుడు మళ్ళీ ధనుష్‌కి క్లోజ్‌గా మూవీ అవుతుందని టాక్. ఇటివల జరిగిన ఓ పార్టీలో త్రిష, ధనుష్ చాలా క్లోజ్‌గా ఉండడం ఇండస్ట్రీ కంటిలో పడిందని, ఆ క్లోజ్ నెస్ హద్దులు దాటినట్లు కనిపించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే త్రిష మాత్రం ధనుష్ మంచి ఫ్రెండ్ మాత్రమేనని సెలవిస్తోంది. కానీ ధనుష్ మాత్రం అటు అమలా పాల్ ఇటు త్రిషలను బాగానే వాడుకుంటున్నాడని కోలీవుడ్‌లో టాక్ వస్తోంది.