పొలిటికల్ లీడర్‌గా త్రిష.. నెగటివ్ రోల్‌లో కనిపిస్తుందట.. పనైపోయినట్టేనా?

మంగళవారం, 19 జనవరి 2016 (14:51 IST)
త్రిషకు గ్లామర్ రోల్స్ చేసి బోర్ కొట్టేసినట్లుంది. అందుకే కళావతి ద్వారా దెయ్యం రోల్ చీకటి రాజ్యం సినిమా ద్వారా యాక్షన్ గర్ల్‌గా మారింది. అయితే ప్రస్తుతం పూర్తి నెగటివ్ రోల్‌లోనూ నటించేందుకు రెడీ అయిపోయింది. గ్లామర్ రోల్స్ చేసి బోర్ కొట్టేయడంతో.. వైవిధ్యం కోసం దొరికిన అవకాశాలను త్రిష చేసుకుంటూ పోతోంది. చీకటి రాజ్యం సినిమాలో త్రిషను ఓ షాకింగ్ అవతారంలో చూసిన జనాలు.. త్వరలోనే ‘నాయకి’గా ఆమెను మరో వైవిధ్యమైన పాత్రలో చూడబోతున్నారు. ‘కళావతి’లో దయ్యంగానూ కనిపించబోతోంది త్రిష.
 
ఇప్పుడు ఏకంగా పూర్తిస్థాయి నెగెటివ్ రోలే చేయడానికి సై అంటోంది. ధనుష్ హీరోగా నటించబోయే ‘కోడి’ సినిమాలో త్రిష ఓ పొలిటికల్ లీడర్ పాత్రలో పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేయబోతోందట. పూర్తిగా విలన్ పాత్రలో కనిపిస్తుందట. ప్రెజెంట్ లేడీ పొలిటీషియన్స్ స్ఫూర్తితో ఈ పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు దురై. సినీ లైఫ్‌లో ఇలాంటి పాత్రలో కనిపిస్తానని అనుకోలేదని.. ఈ సినిమా షూటింగ్ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని అంటోంది. 

వెబ్దునియా పై చదవండి