జైద్ ఖాన్, జయతీర్థ పాన్ ఇండియా చిత్రం బనారస్ నుండి ట్రోల్ సాంగ్
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (16:14 IST)
Banaras troll song
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు,
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ట్రోల్ సాంగ్ విడుదలైంది. బి. అజనీష్ లోక్‌నాథ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన పార్టీ సాంగ్ ఇది. పాట చాలా హుషారుగావుంది. జాస్సీ గిఫ్ట్ వాయిస్ మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. భాస్కరభట్ల సాహిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆసక్తికరంగా సాగింది. జైద్ ఖాన్ వండర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్స్ చాలా వైబ్రైంట్ కనిపిస్తోంది
ఈ చిత్రానికి అద్వైత గురుమూర్తి డీవోపీగా, కెఎం ప్రకాష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది.