'రజనీ అంటే ఇది... స్టైల్ అంటే ఇది... తలైవా అంటే ఇది' అని ట్వీట్ చేశాడు. 'కబాలి' టీజర్‌ను విడుదల చేసిన గంటల్లోనే సోషల్ మీడియాలో లైకులు, షేర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'కబాలి' టీజర్‌కు కోలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్ సినీ పరిశ్రమలు మొత్తం అభినందనలు తెలిపాయి.
కాగా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కబాలి సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పా.రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. అంతేగాకుండా కబాలి ట్రైలర్ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ట్రైలర్‌ను వయసు మీద పడిన డాన్ అవతారంలో రజనీకాంత్ కనిపించారు.
అయినప్పటికీ లుక్‌లో ఎలాంటి స్టైల్ తగ్గకుండా రంజిత్ తెరకెక్కించారు. ఈ ట్రైలర్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తోంది. ఇకపోతే.. కబాలిలో రజినీకాంత్‌కు జంటగా రాధికా ఆప్టే నటించగా, కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా సినిమాలో నాజర్, రోషన్, దినేష్ రవి, ధన్సిక, కలైయరసన్, జాన్ విజయ్, కిషోర్ తదితరులు నటిస్తున్నారు.