అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

డీవీ

శనివారం, 1 ఫిబ్రవరి 2025 (08:11 IST)
U/A Censor Patudala
అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ‘పట్టుదల’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.  
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ మేకింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి ఫిల్మ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, సీడెడ్‌లో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు.
 
ఓంప్రకాష్ విజువ‌ల్స్, యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్, రాక్‌స్టార్‌ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ కానుంది. ఈ చిత్రానికి ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్‌), గోపీ ప్ర‌స‌న్న (ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌), హ‌రిహ‌ర‌సుత‌న్‌(వి.ఎఫ్‌.ఎక్స్‌), సురేష్ చంద్ర (పి.ఆర్‌.ఒ-త‌మిల్‌), నాయుడు సురేంద్ర‌ కుమార్‌ - ఫ‌ణి కందుకూరి (పి.ఆర్.ఒ - తెలుగు) సినిమాలో భాగ‌మయ్యారు.
 
అజిత్ కుమార్  ‘ప‌ట్టుద‌ల‌’ (విడాముయ‌ర్చి) సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు