రుద్రుడిగా ఈ చిత్రంలో ప్రభాస్ అద్భుతంగా కనిపించబోతున్నాడు. ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోషిస్తున్న పవర్ ఫుల్ పాత్రను అందరికీ పరిచయం చేశారు. ప్రభాస్ వేషధారణ, లుక్ చూస్తుంటే దైవత్వం ఉట్టి పడేలా కనిపిస్తోంది.
ఇప్పటికే కన్నప్ప నుంచి శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్రయూనిట్ రివీల్ చేసింది. కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి మహామహులెందరో నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్ అందరిలోనూ అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.