ఈ సినిమాలో రాజాపాండి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, తమన్నా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కాగా, ఈ చిత్రాన్ని తొలి స్వాతంత్ర్య సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో ఒకేసారి నిర్మిస్తున్నారు.