నందమూరి కల్యాణ్‌ రామ్‌ సినిమాలో రాములమ్మ?

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (22:28 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. తాజాగా మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారని తెలిసింది. అది కూడా నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా చేసే సినిమాలో విజయశాంతి కనిపించనున్నారు. 
 
నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. మేకర్స్ విడుదల చేసిన పూజా కార్యక్రమ ఫొటోలలో విజయశాంతి కనిపించడంతో.. ఆమె కల్యాణ్ రామ్ సినిమాలో నటించనుందని టాక్ వచ్చేసింది. 
 
ఇందులో రాములమ్మ ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగానూ, ఆమె పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు