మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా రత్నం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హరి దర్శకత్వంలో రాబోతుండటంతో రత్నం మీద మంచి హైప్ ఏర్పడింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆధరణను దక్కించుకున్నాయి.