మంగళవారంనాడు హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. ఇందులో K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ, చైర్‌పర్సన్ గా వున్నారు. అంతర్గత సభ్యులుగా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది ఎంపికయ్యారు. ఇక బాహ్య సభ్యులుగా రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త, మీడియా నిపుణురాలు కావ్య మండవ, న్యాయవాది మరియు POSH నిపుణురాలు కూడా వున్నారు.
ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టె ఉంచబడింది, దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చు.