ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..తెలుగు సినీ రంగంలోని అన్ని శాఖలు కలిసి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులు వస్తారు. ఈ ఈవెంట్‌ను శ్రేయాస్ మీడియా నిర్వహిస్తోంది. ఇన్విటేషన్స్ అందలేదని మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అన్ని యూనియన్ల ద్వారా సభ్యులందరికీ పీడీఎఫ్ రూపంలో అందరికీ పంపించాము. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబ అని భావించి అందరికీ ఇదే మా వ్యక్తిగత ఆహ్మానం అని భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ కల్యాణ్, అనుపమ్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సీ కల్యాణ్, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్ కుమార్, మాదవపెద్ది సురేష్, సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.