ఇలియానాతో ప్రేక్షకులకు "కిక్" ఇచ్చిన క్రేజీ మాస్ హీరో రవితేజ, 'దుబాయ్ శీను' నయనతారతో మళ్లీ "ఆంజనేయులు"గా తెరపైకి వచ్చేస్తానంటున్నాడు.
నయనతార, రవితేజ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "ఆంజనేయులు". ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.
"యువత" ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గణేష్ బాబు నిర్మాణ పగ్గాలు చేపట్టారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో చిన్నపాటి ఆధ్యాత్మిక విషయాలు కూడా ఉన్నాయని దర్శక నిర్మాతలు అంటున్నారు.
సంవత్సరానికి రెండు, మూడు చిత్రాలతో బిజీబిజీగా ఉన్న రవితేజ ఈ సినిమాతో ప్రేక్షకులకు, అభిమానులకు ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. రవితేజ నటన, నయనతార గ్లామర్, ఎంటర్‌టైనర్‌గా సాగే కథాంశం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మరి రవితేజ ఆంజనేయులుగా ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో? వేచి చూడాల్సిందే..!