ప్రేమ కథలతో చిత్రాలు వస్తున్న తరుణంలో పెద్దలు, ప్రేమికులను ఎలా కలిపారు. వారికి ఏవిధంగా సహకరించాన్న పాయింట్‌తో 'నా లవ్ స్టోరీ' రూపొందింది. ఈ చిత్రానికి దర్శకుడు శివగంగాధర్. జి. లక్ష్మి, కె. శేషగిరిరావు నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూద్దాం.
కథగా చెప్పాలంటే...
ప్రశాంత్ (మహిధర్) తండ్రి చాటు బిడ్డ. బిటెక్ పూర్తయి ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటాడు. తన అపార్ట్‌మెంట్‌లో కొత్తగా వచ్చిన నందినిని (సోనాక్షి) చిత్రమైన స్థితిలో చూడాల్సి వస్తుంది. అది ప్రేమకు దారితీస్తుంది. అయితే వీరి ప్రేమను నందిని తండ్రి ఒప్పుకోడు. మొదట్లో వారి ప్రేమను ప్రోత్సహించిన ప్రశాంత్ తండ్రి కూడా అనంతరం వ్యతిరేకిస్తాడు. ఆ సమయంలో ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు. అదేమిటి? దానివల్ల తల్లిదండ్రులు ఏ నిర్ణయం తీసుకున్నారు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
మహీధర్ తన ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎంతో ప్రతిభ గల నటుడిగా తన నటనతో ప్రూవ్ చేసుకున్నారు. సినిమా కథ తన భుజాలపైన వేసుకున్నాడు. హీరో మహీధర్ హీరోయిన్ సోనాక్షి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్‌లో రెచ్చిపోయారు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా చేసింది. గ్లామర్ విషయంలో తానేంటో చూపించింది. హీరోతో పోటీపడి మరి నటించింది. హీరో, హీరోయిన్లకు తల్లిదండ్రులుగా నటించిన శ్రీమన్నారాయణ, తోటపల్లి మధులు పాత్రలకు సూటయ్యారు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ కాస్త ఆటవిడువుగా నిలుస్తుంది.
ఇందులో పాటలు భువనచంద్ర, శివశక్తి దత్తా అందించారు. అలాగే మంచి ట్యూన్స్ కూడా కుదిరాయి. సంగీత దర్శకుడు వేదనివాస్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. రీరికార్డింగ్ చాలా బాగా ఇచ్చారు. వై.ఇ. కిరణ్ తన సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశాడు. నందమూరి హరి ఎడిటింగ్ బాగుంది. మల్కారి శ్రీనివాస్, డైలాగ్స్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. నిర్మాతలు ఖర్చుకు వెనకడకుండా క్వాలిటీగా నిర్మించారు.
అయితే ఈ సినిమాకు కథే హీరో.. యూత్ కనెక్ట్ అయ్యేలా ఉండే యూనివర్సల్ లవ్ స్టోరీ ఇది. ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుంది. ఏ సన్నివేశం కూడా కథను దాటి వెళ్లదు. దర్శకుడు మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. హీరోతో మొదలయ్యే లవ్ స్టోరీ హీరోయిన్‌తో ఎండ్ అవుతుంది. ఇది ఇప్పటివరకూ రాని పాయింట్. ఈ లవ్ స్టోరీలో ఈ ప్రేమికులిద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం పేరెంట్స్‌లో మార్పు తీసుకువస్తుంది. నెరేషన్ స్లోగా సాగినా బాగానే అనిపిస్తుంది. లవ్ ఎమోషనల్ సీన్స్, కామెడీ సన్నివేశాలున్నాయి కాబట్టి టైంపాస్ చిత్రంగా చూడవచ్చు.