"అదిరిందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైల" చిత్రాల తర్వాత హీరో శివాజీ, దర్శకుడు శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో తెరపైకి వచ్చిన చిత్రం "కుబేరులు" (వీళ్ళకు అన్నీ అప్పులే). ఇందులో అలీ, కృష్ణభగవాన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. గోదావరి టాకీస్‌పై కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా విడుదలైన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.... కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. టాలీవుడ్ హాస్యనటులందరూ నటించిన ఈ సినిమాను... అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.
నిర్మాతలు మాట్లాడుతూ... చక్కని హాస్య ప్రధానంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. సీనియర్ నటి జ్యోతిలక్ష్మి చేసిన ఐటంసాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నిర్మాతలు తెలిపారు. దొంగిలించబడిన నిజాం నగలను చేజిక్కించుకోవాలని ముగ్గురు వ్యక్తులు పడే తిప్పలే ఈ సినిమా అని వారు పేర్కొన్నారు.
ఫర్జానా, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, ఎల్‌బి శ్రీరాం, కొండవలస, ఏవీఎస్ తదితరులు నటించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.