అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉక్రెయిన్ లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది.
ఆ పిల్లాడి ఫోటోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయటంతో ఆ పిల్లాడు హీరోగా మారిపోయాడు. 1000 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ పిల్లాడికి తగిన ఏర్పాట్లు చేసిన గార్డులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ పిల్లాడికి సంబంధించిన వార్తలు, ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.