తెలంగాణలో నో యూజ్, ఏపీలో పొలిటికల్ స్టారా? పవన్‌తో భాజపా గేమ్ సూపర్

సోమవారం, 29 మార్చి 2021 (13:24 IST)
భారతీయ జనతా పార్టీకి ఓ విధానమే లేకుండా పోయిందని ఏపీ మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కరివేపాకులా పక్కకు తీసేసారనీ, ఏపీ విషయం దగ్గరకు వచ్చేసరికి పవన్ రాష్ట్రానికే అధినేత అంటూ చెప్పడం విడ్డూరంగా వుందంటూ విమర్శించారు.
 
తెలంగాణ రాష్ట్రంలో ఆ హీరోపై లేని అభిమానం ఏపీలో ఎలాగో అర్థం కావడంలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్వయంగా పవన్ కళ్యాణే భాజపా తమను అవమానించిందంటూ చెప్పారనీ, అలాంటిది ఇక్కడ ఆయనను రాష్ట్రానికే అధినేతను ఎలా చేస్తామంటున్నారో భాజపా చెప్పాలన్నారు. అసలు భాజపాకి ఖచ్చితమైన జాతీయ విధానమంటూ ఏదో లేకుండా పోయిందంటూ విమర్శించారు.
ఇదిలావుంటే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక నేపధ్యంలో భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ బరిలోకి దిగారు. ఆమె గెలుపు కోసం అటు భాజపా ఇటు జనసేన తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మొత్తమ్మీద చూస్తుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి భాజపా, జనసేన పార్టీకి, లోక్‌సభ విషయంలో జనసేన పార్టీ భాజపాకు మద్దతు ఇచ్చేలా ఓ అవగాహనకు వచ్చినట్లు అర్థమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు