ఇటీవలే పసుపు చీర కట్టుకుని సూపర్ గ్లామర్ గా కనిపించి రాత్రికి రాత్రే సూపర్ ఫ్యామస్ అయిపోయిన ప్రిసీడింగ్ ఆఫీసర్ గురించి చూసేశాం. ఆమె లక్నోలో జరిగిన ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పట్టుకుని వెళ్తుండగా ఆమెను కెమేరాలో బంధించి సోషల్ మీడియాలో వదిలారు. ఆమె హవా అలా నడుస్తుండగానే నీలిరంగు గౌనులో మరో మహిళా ప్రిసీడింగ్ ఆఫీసర్ తలదన్నే గ్లామర్‌తో కెమేరాకు చిక్కారు.
ఆమె అలా ఎందుకు వచ్చారని చాలామంది ప్రశ్నాస్త్రాలు సంధించారు. చివరికి తేలిందేమిటంటే... ఆమెకు మోడలింగ్ అంటే చాలాచాలా ఇష్టమట. అందుకే రకరకాల ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడం ఆమెకు హాబీనట. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికల విధులను నిర్వహించేందుకు ఆ దుస్తుల్లోనే రావడంతో ఆమె గురించి మళ్లీ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతేకాదు... వీళ్ల గ్లామర్ ముందు సినిమా తారల గ్లామర్ కూడా చాలదేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు.