బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్.. ముంబై స్ట్రీట్ ఫుడ్ టేస్ట్.. Sandwich and Chilli Ice Cream

శుక్రవారం, 13 జనవరి 2023 (19:05 IST)
Alex Ellis
భారతదేశ పర్యటనలో వున్న బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మరోసారి భారతీయ వంటకాలపై తనకున్న ప్రేమను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గురువారం, అతను ముంబైలోని రోడ్డు పక్కన వ్యాపారి నుండి వేడి భోజనాన్ని ఆస్వాదిస్తున్న రెండు చిత్రాలను పోస్ట్ చేశారు. 
 
పసందైన వంటకం "ముంబై శాండ్‌విచ్"-చిల్లీ ఐస్ క్రీం.. అంటూ పోస్టు చేశారు. ఈ ఫోటోలకు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే లైకులు, వ్యూస్ వెల్లువెత్తుతున్నాయి. ముంబైలో స్ట్రీట్ ఫుడ్‌ను కొనియాడుతూ.. ఎల్లిస్ చేసిన పోస్టులకు విశేష స్పందన వస్తోంది. 
 
సాధారణంగా ఎల్లిస్‌కు భారతీయ వంటకాల పట్ల మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఎల్లిస్ చేసిన ఈ తాజా పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయ ఆహారం, సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమకు మరో ఉదాహరణ అంటూ వారు కితాబిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు