దీనిపై స్పందించిన వేణుగోపాల్ తమ పార్టీ అధిష్టానంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని...పార్టీ అధినేతతో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని తెలుపుతామని చంద్రబాబుకు తెలియజేశారు. అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్ చేరుకున్న చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీ మినహా వివిధ పార్టీల ఫ్లోర్‌లీడర్లను కలుసుకున్నారు.
చంద్రబాబు కలుసుకున్న వారిలో ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్ రెడ్డి, వీరప్పమొయిలీ, రాజీవ్ సాతీవ్‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్‌లు ఉన్నారు. అవిశ్వాసంపై మద్దుతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీ ఫ్లోర్ లీడర్లను చంద్రబాబు కలుసుకుని ధన్యవాదాలు తెలుపున్నారు.