''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమాను ఏ వేళ తీశాడోగానీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏమాత్రం ఆ విషయం కలిసిరాలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఏపీ మాజీ సీఎంను విలన్‌గా చూపెట్టడం ద్వారా ఎన్నికల ముందు టీడీపీ ఆ సినిమా ప్రభావం మైనస్‌నే మిగిల్చింది. ఆ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకున్నా.. ఎన్నికల నేపథ్యంలో ఆ సినిమా ప్రభావం చంద్రబాబు పడిందనే టాక్ వచ్చింది.
ఇలాంటి తరుణంలో మండుతున్న మంటల్లో ఆజ్యం పోసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా, ఆయన్ను నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచారనీ, ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.