కరోనావైరస్ తీవ్రం కావడంతో ప్రతి ఒక్కరు భయంతో వుంటున్నారు. కరోనా రాకుండా వుండేందుకు గతంలో ఎందరో చెక్క, లవంగాలు, అల్లం తదితర వంటింటి దినుసులు వేసి కషాయాలు కాచుకుని తాగడంతో కొందరు కాలేయ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఉదంతాలు వెలుగుచూసాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది.
నిమ్మకాయకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని నమ్మిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా నిమ్మకాయ రసాన్ని ముక్కు రంధ్రాల్లో పిండాడు. అలా పిండటం ద్వారా నిమ్మరసం నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి కరోనాను రాకుండా అడ్డుకుంటుందని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఉపాధ్యాయుడు రాయచూరు జిల్లాకి చెందినవారు కాగా ఆయన వయసు 43 ఏళ్లు.