ప్రముఖ మోడల్ మానసి దీక్షిత్ హత్య కేసులోని మిస్టరీ వీడింది. కోరిక తీర్చలేదన్న అక్కసుతో ఓ యువకుడు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులో వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరానికి చెందిన మానసి దీక్షిత్ (20) మోడలింగ్ చేసేది. ప్రముఖ మోడల్ మానసి దీక్షిత్ 6 నెలల క్రితం ముంబై నగరానికి వచ్చి అంధేరిలోని మిల్లత్‌నగర్‌లో నివాసముండేది.
ఇంట్లో తన కోరిక తీర్చాలని సయ్యద్ మానసిని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో కోపంతో సయ్యద్ స్టూలు తీసుకొని మానసి తలపై కొట్టాడు. అంతే స్పృహ కోల్పోయిన మానసిని లేపేందుకు ఆమెపై సయ్యద్ నీళ్లు చల్లాడు. మానసి కొంచెం స్పృహలోకి వచ్చినా భయపడిన సయ్యద్ తాడును ఆమె మెడకు బిగించి హత్య చేసి ఆ శవాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టిదాన్ని మలాద్ ప్రాంతంలోని మైండ్ స్పేస్ వద్ద పొదల్లో పడేశాడు.
స్థానికులు బ్యాగు నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి బ్యాగు విప్పి చూడగా మోడల్ మానసి దీక్షిత్ మృతదేహం కనిపించింది. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా సయ్యద్ క్యాబ్‌లో తీసుకొచ్చి మృతదేహాన్ని పొదల్లో పడేసినట్లు తేలింది. క్యాబ్ డ్రైవరు అందించిన సమాచారంతో ఈ కేసు మిస్టరీ వీడింది. దీంతో పోలీసులు సయ్యద్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.