అలా వేధించి.. అమెరికాలో ఉన్న భార్య దగ్గర నుంచి కోటి రూపాయలు కొట్టేసాడు సంతోష్. మిత్రుడు పేరుతో భార్యకే అశ్లీల వీడియోలు ఫోటోలు పంపి వేధింపులకు గురి చేసాడు. కోటి రూపాయలు పంపించాలని.. లేదంటే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి... వాటిని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పంపిస్తాను. తనతో చాట్ చేసిన విషయం... ఇలా మీ ఆయనకు చెప్పేస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేసాడు.
అయితే భర్త సంతోష్ పైన భార్యకు అనుమానం వచ్చింది. అంతే, సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు సైబరాబాద్ మహిళా పోలీసులు. ఈ విధంగా మొగుడు ఆట కట్టించింది భార్య.